Hero Sunil Hilarious Speech at Silly Fellows Movie First Look Launch. Allari Naresh and Sunil are lead roles in Silly Fellows
#SillyFellows
# AllariNaresh
#Sunil
అల్లరి నరేష్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిల్లీ ఫెలోస్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సునీల్ హీరోగా వరుసగా పరాజయాలు చవిచూశాడు. అల్లరి నరేష్ కూడా సక్సెస్ ట్రాక్ తప్పి చాలా కాలం అవుతోంది. ఈ నేపథ్యంలో సిల్లీ ఫెలోస్ చిత్రం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఫస్ట్ లుక్ లుక్ ఈవెంట్ సునీల్ మాట్లాడారు. చాలా కాలం నుంచి నన్ను నేను మిస్ అవుతున్నా. నా నుంచి అంతా మంచి కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో నన్ను నేను మిస్ అవుతూ వచ్చా. కానీ సిల్లీ ఫెలోస్ చిత్రం నుంచి మీ అందరికి మిస్సెస్ అవుతా అని సునీల్ చమత్కరించాడు.
ఈ చిత్రంలో అసలు సిసలు కామెడీ చూపించబోతున్నాం అని సునీల్ అన్నాడు. సొంతం, ఆడుతూ పాడుతూ వంటి చిత్రాల తరువాత ఆ స్థాయిలో ఈ చిత్రంలో కామెడీ పండించానని సునీల్ తెలిపాడు.