Hero Sudheer Babu Emotional on Stage. Mahesh about Sudheer Babu
సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ ని ఉద్దేశించి మహేష్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహెష్ కొత్త గెటప్ అభిమానులని సమ్మోహన పరిచిందని చెప్పొచ్చు. ప్రముఖ దర్శకులు కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడివల్లి ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. జెంటిల్ మాన్ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన ఖాతాలో అష్టాచమ్మా, జెంటిల్ మాన్ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఈవెంట్ కు రావడంతో సమ్మోహనం చిత్రంపై తనకు ఉన్న చిన్న భయం పోయిందని సుధీర్ తెలిపాడు. మంచి సినిమా తీసాం. జనాలకు రీచ్ అవుతుందా లేదా అనే భయం ఉండేది. మహేష్ బాబు కొత్త గెటప్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావడం వలన ఆ భయం పోయిందని సుధీర్ తెలిపాడు. ఇప్పుడు సమ్మోహనం చిత్రం గురించి అందరికి తెలిసిందని అన్నాడు.
తన ప్రసంగం మధ్యలో సుధీర్ బాబు ఎమోషనల్ అయ్యాడు. మధ్యలోనే ప్రసంగాన్ని ఆపేశాడు. సమ్మోహనం చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గురించి మాట్లాడుతూ సుధీర్ బాబు ఎమోషనల్ అయ్యాడు.
సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ.. సుధీర్ తన ఫంక్షన్స్ కి వచ్చి ఇరగ్గొట్టేస్తాడు అని కానీ తన ఈవెంట్స్ లో మాత్రం ఎమోషనల్ అయిపోతున్నాడని మహేష్ తెలిపాడు.