Director Vakkantham Vamsi Speech At Manam Saitam

Filmibeat Telugu 2018-06-12

Views 697

Director Vakkantham Vamsi Speech at Manam Saitam. Tollywood celebrities donates for Manam saitham

చిత్రపరిశ్రమలో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు నటుడు కాదంబరి కిరణ్ మనం సైతం అనే ప్రోగ్రాం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఒక్కొకరుగా చేయూత అందిస్తున్నారు. ఇటీవల ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, నా పేరు సూర్య చిత్ర దర్శకుడు వక్కంతం వంశీ హాజరయ్యారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని కాదంబరి కిరణ్ చేస్తున్నారని వక్కంతం వంశి అన్నారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ని వక్కంతం వంశి ప్రశంసలతో ముంచెత్తారు.
కాదంబరి కిరణ్ తనకు చాలా రోజులుగా పరిచయం అని దర్శకుడు వక్కంతం వంశి అన్నారు. ఈ మధ్య తనని చాలా సార్లు కలసినప్పటికీ తన చిత్రంలో వేషం ఇవ్వాలని అడగలేదని వక్కంతం వంశి తన స్వార్థం కోసం ఏమి అడగలేదు. కానీ నలుగురికి మంచి జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలి కోరాడు అని వక్కంతం వంశి తెలిపాడు.
మనం సైతం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన కాదంబరి కిరణ్ పదిమందికి సాయపడడం అనే జబ్బు పెంచుకుంటూ పోతున్నాడని వక్కంతం వంశి అన్నారు. ఆ జబ్బు ఎప్పటికి తగ్గకూడదు. అందరికి అంటుకోవాలని కోరుకుంటున్నట్లు వక్కంతం వంశి తెలిపాడు.

Share This Video


Download

  
Report form