The charming leader in congress party revanth reddy maintaining distance with the t pcc. revanth alleged the seniors are trying to keep him in the dark side. that's why he is asking appointment for aicc chief rahul gandhi. revanth followers are saying that if appointment finalize with rahul gandhi the issue will be settle down.
#revanthreddy
# rahulgandhi
తెలంగాణ కాంగ్రేస్ పార్టీలో రేవంత్ రెడ్డి చర్చనీయాంశంగా మారారు. కొద్ది నెలలుగా మౌనంగా ఉంటున్న రేవంత్ రెడ్డి నేరుగా పార్టీ జాతీయ అద్యక్షుడు రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ కోరుతున్నారు. రాహుల్ అప్పాయింట్ మెంట్ ఫిక్స్ అయితే సమస్యలన్నీ పరిష్కరించబడతాయని రేవంత్ వర్గం అంటోంది. స్థానిక పీసిసి తో తలెత్తిన విభేదాలు కూడా సర్ధుమనుగుతాయనే చర్చ జరుగుతోంది.రేవంత్ రెడ్డి మళ్లీ ప్రజా క్షేత్రంలోకి అడుగుపెడితే తెలంగాణ కాంగ్రేస్ పార్టీకి వంద సునామీల బలం చేకూరడం ఖాయమని కార్యకర్తలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కనిపించడం లేదు.. పార్టీ కార్యక్రమాల్లో ఆయన జాడే లేదు. మీడియాలో రేవంత్ మాటే వినిపించడం లేదు. బస్సు యాత్రలో ఆయన ఊసే లేదు. అవును ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గొంతు మూగబోయింది. గత కొన్ని రోజులుగా ఆయన ఎక్కడనున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. పార్టీ కార్యక్రమాల్లో రేవంత్ ఎక్కడా కనిపించడం లేదు. గాంధీ భవన్ లో అడుగు పెట్టడం లేదు. సిఎల్పీలో కూర్చోవడం లేదు. పీసీసీ ఛీప్ వైఖరీతో అసంత్రుప్తిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం మౌన ముద్ర దాల్చారు. పార్టీలో చేరి నెలలు గడుస్తున్నా తనను పట్టించుకోకపోవడంపైన ఆయన గుర్రుగా ఉన్నారు. తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన నాయకులకు న్యాయం చేయలేకపోతున్నానన్న ఆవేదన రేవంత్ లో కనిపిస్తోంది. కనీసం వారికైనా పదవులు ఇప్పించాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్.. అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు.