Producer Radhakrishna gifts costly car to NTR. Radhakrisha is prodecer for Aravindha Sametha movie
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ ఎన్టీఆర్ కు కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ చిత్రంలో త్రివిక్రమ్ బలమైన యాక్షన్ సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్ర నిర్మాత రాధాకృష్ణ ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా రేంజ్ రోవర్ కారు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కు ఇప్పటికే 9999 నంబర్ తో రేంజ్ రోవర్ కారు ఉంది. ఎన్టీఆర్ మామ ఈ కారుని ఇచ్చారు. ఇదే నంబర్ తో రాధాకృష్ణ రేంజ్ రోవర్ కారు కొన్నారట.