Fifa World Cup 2018 : Cat, Predicts The Winner For World Cup Opener

Oneindia Telugu 2018-06-14

Views 129

Russia and Saudi Arabia have met only once before way back in October 1993, a friendly match which the Middle East country won 4-2. Russia are winless in their last five games at the World Cup while Saudi Arabia have kept only one clean sheet in their 13 games at the World Cup - it was in their 1-0 win against Belgium in June 1994.

ఫిఫా వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో సాకర్ సంరంభం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆరంభ వేడుకల అనంతరం ఇదే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది.
అయితే, ఈ ఆరంభ మ్యాచ్‌లో గెలుపెవరిది? అంటే.. ఆతిథ్య జట్టుకే తన ఓటు అంటోంది రష్యాకు చెందిన చెవిటి పిల్లి అచిల్లె. ఇక్కడ విశేషం ఏంటంటే గత ఎనిమిది నెలలుగా రష్యా ఒక్క విజయం కూడా సాధించలేదు. వరల్డ్ కప్ మ్యాచ్ ఫలితాలను అంచనా వేయడానికి అచిల్లెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రెండు దేశాల జాతీయ జెండాలను ముందుంచితే, రష్యా పతకాన్ని పిల్లి ఎంచుకుంది. ఇక.. జర్మనీలోని చెమ్‌నిట్జ్‌ పార్క్‌కు చెందిన ఓలోజ అనే పులి మాత్రం తొలి పోరు ఫలితాన్ని భిన్నంగా ఊహించింది. రెండుదేశాల జెండాల బాక్స్‌లను ముందుంచగా.. దేనిని ముట్టుకోకుండా తన ఫలితాన్ని పరోక్షంగా డ్రాగా నిర్ధారించింది.
అచిల్లె అంచనా ఎంతవరకు నిజమౌతుందో తెలియాలంటే మ్యాచ్‌ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. 2010 వరల్డ్ కప్ సమయంలో ఆక్టోపస్‌ పాల్‌ ఇదే విధంగా మ్యాచ్‌ ఫలితాలను అంచనా వేసింది. ఫైనల్‌ విజేతతో పాటు అది చెప్పిన మ్యాచ్ ఫలితాలన్నీ సరిగానే వచ్చిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form