Race 3 Record Breaking Business At The Domestic Market

Filmibeat Telugu 2018-06-19

Views 1

With Race 3's record breaking business at the domestic market, Salman Khan has once again proved that he is the real 'Sikander' of Bollywood in terms of box office collections. Despite getting negative reviews, the Remo D'Souza directorial made a huge business in its opening weekend and crossed Rs 100 crore mark in just three days of its release.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'రేస్ 3' మూవీ ఇండియాలో అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళుతోంది. కలెక్షన్ల పరంగా తానే బాలీవుడ్ రియల్ సికిందర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ యావరేజ్ టాక్‌లోనూ భారీ ఓపెనింగ్స్ సాధించింది. తొలి మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. అంతే కాదు పలు బాలీవుడ్ రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టింది. కేవలం సల్మాన్ ఖాన్ మీద ఉన్న క్రేజ్ వల్లే ఇది సాధ్యమైందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రేస్ 3 మూవీ తొలి రోజు రూ. 29.17 కోట్లు వసూలు చేసింది. మర్నాడు ఈద్ పండగ హాలిడే కావడం కూడా బాగా కలిసొచ్చింది. దీంతో శనివారం రోజు రూ. 38.14 కోట్లు రాబట్టింది. ఇదే జోరు ఆదివారం కూడా కంటిన్యూ అయి రూ. 38.16 కోట్లు రాబట్టింది. దీంతో తొలి మూడు రోజుల్లో రూ. 106.47 కోట్లు రాబట్టింది.
సల్మాన్ ఖాన్ మూవీ తొలి మూడు రోజుల్లో రూ. 100 కోట్లు అందుకోవడం ఇది నాలుగోసారి. గతంలో ఆయన నటించిన బజరంగీ భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హై చిత్రాలు తొలి మూడు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించాయి.
2018లో విడుదలైన సినిమాల్లో..... రేస్ 3 మూవీ సెకండ్ బిగ్గెస్ట్ వీకెండ్ ఓపెనర్‌ గా నిలిచింది. మొదటి స్థానంలో రూ. 114 కోట్లతో ‘పద్మావత్' ఉండగా... రేస్ 3 తర్వాతి స్థానంలో రూ. 73.10 కోట్లతో బాగీ, రూ. 41.01 కోట్లతో రైడ్, రూ. 40.05 కోట్లతో పాడ్‌మ్యాన్ చిత్రాలు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS