Megastar Chiranjeevi Speech Vijetha Audio Launch Event. Remembers his VIjetha movie
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ పాజిటివ్ వైబ్రేషన్స్ తో టాలీవడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అతడు నటిస్తున్న విజేత చిత్రం చుట్టూ పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ప్రతిష్టాత్మకమైన వారాహి చలన చిత్ర బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం. నూతన దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. ఆదివారం రోజు ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి ముఖ్యఅతిథి కాగా, రాజమౌళి, కీరవాణి అతిథులుగా హాజరయ్యారు. ఆడియో వేడుకలో విజేత థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.
ఆడియో వేడుకలో చిరు ప్రసంగించారు. విజేత అనే టైటిల్ వినగానే తనకు తాను నటించిన విజేత చిత్రం గుర్తుకు వస్తుందని చిరు అన్నారు. అప్పట్లో తాను వరుసగా మాస్ చిత్రాలు చేస్తున్న సమయంలో విజేత సినిమా చేసానని చిరు తెలిపారు.
నూతన హీరోగా పరిచయం అవుతున్న కళ్యాణ్ కు ఎలాంటి ఇమేజ్ లేదు. కథ పరంగా ఇది అనుకూలించే అంశం అని చిరు అన్నారు. ఈ చిత్రానికి తన విజేత చిత్రంతో పోలికలు ఉన్నాయని చిరంజీవి తెలిపారు.