batsman Umar Akmal has been served a show cause notice by the country's cricket board for failing to report a approach before the 2015 World Cup match against arch-rivals India.
పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా భారత్‌తో మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్ వెల్లడించాడు. ''2015 వరల్డ్ కప్‌లో భారత్‌తో అదే మా తొలి మ్యాచ్. ఈ సందర్భంగా నేను వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు" అని అక్మల్ అన్నాడు.
అంతకు ముందు కూడా అలాంటి భారీ ఆఫర్లు పెద్ద ఎత్తున వచ్చాయి, కానీ వాటిని తిరస్కరించా. వాటికి నేను విరుద్ధమని, మరోసారి ఇలాంటి ఉద్దేశాలతో నా దగ్గరకు రావద్దని వాళ్లకు గట్టిగా చెప్పా'' అని అక్మల్ చెప్పాడు. ఈ సంచలన ఆరోపణలపై ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు వివరణ ఇవ్వాలంటూ అక్మల్‌కు సమన్లు జారీ చేశాయి.