Comedian Shakalaka Shankar decided to try out his luck as the male lead in films. He is reportedly making his lead debut in the film ‘Shambho Shankara’ to be directed by newcomer N Sreedhar. Ramana Reddy and Suresh Kondeti are producing the film under SK Pictures banner. This movie lyrical song released by VV Vinayak. This movie got good response first day at box office.
కమెడియన్ షకలక శంకర్ హీరోగా మారి నటించిన శంభో శంకర చిత్రానికి మాస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. హీరోగా శంకర్‌కు తొలి సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించిందని చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
శంభో శంకర చిత్రానికి పాజిటివ్ రెస్సాన్స్ వస్తున్నది. మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.2.05 కోట్లు సాధించింది. ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అంటూ నిర్మాత సురేష్ కొండేటి ఓ ప్రకటనలో తెలిపారు. వై రమణారెడ్డితో కలిసి సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
శంభో శంకర్ చిత్రాన్ని 585 థియేటర్లలో రిలీజ్ చేశాం. మొదటి రోజు మా చిత్రం 2 కోట్ల 5 లక్షల 18 వేల 125 రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ కలెక్షన్ల సునామీని ఎవరూ ఆపలేరు అని పోస్టర్‌లో పేర్కొన్నారు.
రొటీన్ కథను తీసుకొని షకలక శంకర్ ఇమేజ్‌కు తగినట్టుగా మాస్ హంగులు చేర్చి శంభో శంకర చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి శ్రీధర్ దర్శకుడు. రైతుల సమస్యలు, ఇతర సామాజిక సమస్యల ఇతివృత్తంతో ప్రేక్షకులను దర్శకుడు మెప్పించే ప్రయత్నం చేశారు.