Ram Charan Constructing Film Studio For Chiru

Filmibeat Telugu 2018-07-02

Views 8

Film Nagar Buzz is that, Ram Charan had purchased 25 acres on the outskirts of Hyderabad to construct Konidela studio. At present, the shooting of Sye Raa Narasimha Reddy is taking place in the same land. After completion of movie shooting, Chiranjeevi will perform Bhoomi puja for the land and studio will be ready by 2022.
మెగాస్టార్ చిరంజీవి... తన నలభై ఏళ్ల కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. నెం.1 స్థానాన్ని అందుకోవడంతో పాటు సంచలన విజయాలు నమోదు చేశారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని విస్తరించారు. కానీ చిరంజీవికి కొన్ని దశాబ్దాలుగా ఓ తీరని కోరిక అలాగే ఉండిపోయింది. అదే... మెగా ఫ్యామిలీకంటూ సొంతగా ఫిల్మ్ స్టూడియో లేక పోవడం. గతంలో ఎన్నో సందర్భాల్లో చిరంజీవి సొంత స్టూడియో కట్టాలని ప్లాన్ చేసినా వీలు పడలేదు. అయితే తండ్రి కోరికను తనయుడు రామ్ చరణ్ త్వరలో తీర్చబోతున్నారని, హైదరాబాద్‍‌లో కొణిదెల స్టూడియోస్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.
ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్... తండ్రి కలను నిజం చేసే దిశగా మెగాప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. 25 ఎకరాల్లో సినీ స్టూడియో కట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ శివారులో రామ్ చరణ్ 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారని. ప్రస్తుతం తను నిర్మిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి' షూటింగ్ అక్కడే జరుగుతోందని, ఇదే ప్రాంతంలో త్వరలో స్టూడియో వెలవబోతోందని చర్చించుకుంటున్నారు.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS