Allari Naresh Birthday celebrations at Mahesh 25 sets. Allari Naresh playing key role in this movie
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ 25 వ చిత్రం కావడంతో వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా అల్లరి నరేష్ బర్త్ డే వేడుకని చిత్ర యూనిట్ సెలెబ్రేట్ చేసింది.
ఈ చిత్రంలో అల్లరి నరేష్.. మహేష్ బాబుకు స్నేహితుడిగా నటించబోతున్నట్లు సమాచారం. అల్లరి నరేష్ ఈ చిత్రంలో నిరుపేద యువకుడిగా కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది.
మహేష్ బాబు ఈ చిత్రంలో ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. రైతు సమస్యలు, మహేష్ బాబు స్టూడెంట్ గా ఉండడం, వీటన్నింటిని లింక్ ఏంటనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువవుతోంది.
డెహ్రాడూన్ లోనే అల్లరి నరేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, పూజాహెగ్డే ఇతర చిత్ర యూనిట్ అల్లరి నరేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.