Pak batsman Shoaib Malik on Sunday became the third cricketer to complete 2,000 runs in Twenty20 Internationals. Shoaib Malik achieved the milestone during the Twenty20 tri-series against Zimbabwe in Harare. Malik, who scored an unbeaten 37 runs off 24 balls, is now behind New Zealand duo Brendon McCullum and Martin Guptill, who are on first and second spot, respectively. McCullum, who bid adieu to international cricket in 2016, tops the run-scoring charts with 2,140 runs, while Guptill has 2,271 runs under his belt.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో రెండువేల పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న టీ20లో సిరీస్‌లో షోయబ్ మాలిక్ ఈ రికార్డు నెలకొల్పాడు.
ఈ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ 24 బంతుల్లో 37 పరుగులు సాధించడం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు టీ20ల్లో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఆ ఇద్దరూ న్యూజిలాండ్‌కు చెందిన క్రికెటర్లే కావడం విశేషం.
న్యూజిలాండ్ క్రికెటర్లు మార్టిన్ గుప్తిల్(2,271), బ్రెండన్ మెక్‌కలమ్(2,140) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కాగా, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ(1,992 పరుగులు) మూడో స్థానంలో ఉండగా, తాజాగా కోహ్లీని వెనక్కినెట్టి షోయాబ్ మాలిక్(2,026) మూడో స్థానంలో నిలిచాడు.
#saniamirza
#husband
#shoaibmalik
#Kohli