NTR Biopic : Mokshagna Plays A Role In Movie

Filmibeat Telugu 2018-07-04

Views 594

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం అన్ని అడ్డంకుల్ని అధికమించి జులై 5 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం.. పైగా బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటించబోతుండడంతో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించబోతోంది. ఇతర పాత్రల గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ యుక్తవయసులో ఎన్టీఆర్ పాత్రని పోషించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యాబాలన్ నటించబోతోందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ గురించి కూడా వార్తలు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం యువకుడిగా ఉన్న ఎన్టీఆర్ పాత్రలో మోక్షజ్ఞ అయితే సరిపోతాడని దర్శకుడు క్రిష్ బాలయ్యని ఒప్పించినట్లు తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం శర్వానంద్ ని అనుకున్నారు.

NTR Biopic shoot starts from tomorrow. Interesting news on Moksagna regarding NTR biopic
#NTR

Share This Video


Download

  
Report form