Salman Khan Makes His Promise

Filmibeat Telugu 2018-07-04

Views 3

మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండే వాళ్లు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటారు. ఎప్పుడో సరదాకు మాట ఇచ్చిన సల్మాన్ ఖాన్ ఆ మాటను నిజం చేస్తున్నారు. సల్మాన్ తీసుకొన్న నిర్ణయంపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనకు 30 ఏళ్లుగా బాడీగార్డ్‌గా పనిచేస్తున్న గుర్మిత్ సింగ్ అలియాస్ షేరా కుమారుడిని హీరోగా పరిచయం చేయబోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
ఆంగ్ల దినపత్రికతో సల్మాన్ ఖాన్ సన్నిహితుడు మాట్లాడుతూ.. తన బాడీగార్డ్ షేరా కుమారుడు టైగర్ పుట్టినప్పడు సల్మాన్ ఓ ప్రామిస్ చేశాడు. పుట్టగానే పసిపాపను ఎత్తుకొని వీడియిన హీరో చేస్తానని అన్నాడు. వీడు హీరో అవుతాడు. వీడినే నేనే హీరో చేస్తాను అని ఆనందంతో ఓ మాట చెప్పాడు అని వెల్లడించాడు.
పుట్టిన బిడ్డను చూసి సంతోషంలో అలా అని ఉంటాడని షేరా ఆ విషయాన్ని లైట్ తీసుకొన్నాడు. ఇప్పుడు టైగర్‌కు యుక్త వయసు వచ్చింది. దాంతో ఇప్పుడు షేరా కొడుకును తన సొంత బ్యానర్‌పై లాంచ్ చేయడానికి నిర్ణయం తీసుకొన్నాడు.
ప్రస్తుతం సల్మాన్ బావ నటించిన లవ్‌రాత్రి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ చిత్రం విడుదలైన తర్వాత టైగర్‌ను హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఓ యాక్షన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం చేయాలని అనుకొంటున్నాడు అని సల్మాన్ సన్నిహితుడు మీడియాకు చెప్పాడు.

Salman Khan is the Bhai and the messiah of Bollywood, as many of his ardent fans like to believe. Years ago, when Salman's bodyguard of 30 years, Gurmeet Singh AKA Shera's son, Tiger was born, Salman had declared that he would become an actor. His friend said Salman had picked up the newborn boy and said, 'Yeh hero banega. Main banaunga'.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS