రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును గురువారం ఆవిష్కరించారు. ఇప్పటికే జియోతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ... కొత్తగా జియో గిగా ఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ప్రారంభించారు. 1,100 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని... జియోగిగా ఫైబర్ ద్వారా 600కు పైగా ఛానెళ్లను వీక్షించడంతో పాటు, వేల సంఖ్యలో సినిమాలు, పాటలు కూడా వినొచ్చని చెప్పారు అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ. జియో గిగా ఫైబర్ ప్రకటనతో పాటు మరో వర్షాకాలపు ఆఫర్‌ను కూడా రిలయన్స్ సంస్థ ప్రకటించింది. ఇప్పటకే జియో ఫీచర్ ఫోన్లను వాడుతున్న వారు కేవలం రూ.501 చెల్లించి కొత్త ఫోన్ తీసుకోవచ్చని తెలిపింది. అంటే రూ.1500 ఉన్న జియో ఫోన్ కేవలం రూ. 501కే రిలయన్స్ అందిస్తోంది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జియో ప్రాజెక్టు దేశంలోని ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి తాలూకాకు చేరుకోవాలన్నదే తమ లక్ష్యం అని ముఖేష్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 2 కోట్ల మంది ప్రజలు జియో ఫోన్‌ను వినియోగిస్తున్నారన్నారు.
Reliance Industries chairman and managing director Mukesh Ambani on Thursday launched JioGigaFiber at RIL's 41st annual general meeting (AGM). This is the broadband service of Reliance Jio, Reliance Industries' telecom arm that will be spread in 1,100 cities of India.
#relianceindustries
#jio
#jiogigafibre
#mukeshambani
#jiophones