రాజకీయాలు పై పవన్ స్పందన

Oneindia Telugu 2018-07-07

Views 447

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం తన విశాఖపట్నం పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను యోగా మార్గాన్నే వదిలేశానని, ఇక తనకు పదవులు ఎందుకని వ్యాఖ్యానించారు. తన సోదరుడు చిరంజీవి కుటుంబంపై రాజకీయ కుట్ర జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ అధికార పార్టీని ఏకిపారేస్తున్నారు.
ఏదో ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల కోసమే వచ్చానని చెప్పారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానని అన్నారు. తనకు ఏం కావాలో చెప్పాలని వారు అడిగారని, కానీ తనకు ఏదీ వద్దని వారితో అన్నానని తెలిపారు. ప్రజలకు మంచి జరిగితే చాలనని చెప్పానని గుర్తు చేసుకున్నారు.
విశాఖపట్నంకు చెందిన పలువురు నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. తాను చాలా ఆలోచించి రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. రిస్క్ నాది అని, పోతే తన ప్రాణాలు పోతాయని, తాను రాజకీయాల్లోకి వచ్చినందుకు ఏ కోరికలు పెట్టుకోలేదని చెప్పారు.
తాను భగవన్మార్గాన్ని వదిలి వచ్చినవాడినని పవన్ చెప్పారు. యోగమార్గాన్ని వదిలి వచ్చిన వాడినని తెలిపారు. ముక్తి లభించవచ్చును కానీ, ప్రజలు ఇబ్బందులతో ఏడుస్తుంటే, ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే అలాంటి ఆ ముక్తి ఎందుకు అనిపించిందని వ్యాఖ్యానించారు. అలాంటి ముక్తి తనకు అవసరం లేదనిపించిందన్నారు. పదవులు కూడా అవసరం లేదన్నారు.

Jana Sena chief Pawan Kalyan on Friday said that why he enter second time into politics.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS