నేను పారిపోవడం అనే కాన్సెప్ట్ ఎక్కడిది: మాల్యా

Oneindia Telugu 2018-07-13

Views 3.8K

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం తనను వాడుకోవాలని ఎన్డీయే చూస్తోందని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఆరోపించారు. శిలువపై ఉరి తీస్తే ఓట్లు రాలుతాయని భావిస్తోందన్నారు. రాజకీయ అవసరాల కోసం భారత ప్రభుత్వం తనను వెంటాడుతోందన్నారు. మాల్యాను ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం ఆయనను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఇటీవల ఆయన ఆస్తులను సీజ్ చేయాలని కూడా లండన్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాల్యాపై ఒత్తిడి పెరిగింది. దీంతో కేంద్రంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ హయాంలో డబ్బులు రుణాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా.. ఇటీవల రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను కూడా రీట్వీట్ చేశాడు.

Vijay Mallya said on he will comply fully with court enforcement officers seeking to seize his British assets, but there was not much for them to take as his family’s lavish residences were not in his name.
#london
#court
#vijaymallya
#assets
#narendrasmodi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS