FIFA 2018: England Vs Croatia Match Preview

Oneindia Telugu 2018-07-11

Views 536

రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో మరో కీలక సమరానికి వేళైంది. టోర్నీలో భాగంగా బుధవారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌-క్రొయేషియా జట్ల తలపడనున్నాయి. 1990 తర్వాత ఇంగ్లాండ్‌కు ఇదే తొలి సెమీస్‌ కాగా.. క్రొయేషియాకు మొత్తంగా ఇది రెండోది కావడం విశేషం.తొలిసారిగా 1966లో చాంపియన్‌ అయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత అత్యుత్తమంగా 1990లో సెమీస్‌కు చేరింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ జట్టు మరోసారి టాప్‌-4లో చోటు దక్కించుకుంది. మరోవైపు అండర్‌డాగ్‌గా టోర్నీలో ప్రవేశించిన క్రొయేషియా 16 ఏళ్లుగా గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.కానీ, ఈసారి మాత్రం అనూహ్యంగా సెమీస్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుసగా రెండు పెనాల్టీ షూటవుట్లను ఎదుర్కొని నెగ్గిన రెండో జట్టుగా కూడా రికార్డు సాధించింది. ఇంగ్లాండ్‌ కూడా తన పెనాల్టీ షూటౌట్‌ బలహీనతను అధిగమిస్తూ.. ప్రిక్వార్టర్స్‌లో షూటౌట్లో కొలంబియాను ఓడించింది

England and Croatia are just one step away to reach the final of the FIFA World Cup 2018. Both the teams have surprised many fans around the world as they reached the penultimate round of the tournament.
#england
#croatia
#worldcup2018
#fifaworldcup2018
#russiaworldcup
#football
#fifa

Share This Video


Download

  
Report form