India’s tour to the United Kingdom has more or less gone according to what they would have planned. After blowing away Ireland in a couple of games, Virat Kohli and his men clinched the T20I series against England by a margin of 2-1. In the next chapter of the highly anticipated tour, India takes on England in a three-match ODI series with the first encounter on Thursday at Trent Bridge, Nottingham.
#india
#england
#indiainengland2018
#viratkohli
#rohitsharma
#klrahul
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్‌కి అసలు సిసలైన సవాల్ గురువారం నుంచి మొదలవనుంది. సరిగ్గా ఏడాది తర్వాత ఇదే సమయంలో ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఆ టోర్నీ ముందు అక్కడ భారత్ ఆడనున్న చివరి వన్డే సిరీస్ ఇది. అక్కడి పరిస్థితులు, పిచ్‌లపై అంచనాకు వచ్చేందుకు ఇదో చక్కటి అవకాశం. అంతేకాదు ఎలాగైనా ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా వన్డే సిరీస్ సాధించడం చాలా ముఖ్యం.ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టబోతోంది. టీ20 ఫార్మాట్‌తో పోలిస్తే.. వన్డేల్లో ఇంగ్లాండ్ ప్రమాదకర జట్టు. ఇంగ్లాండ్ 46 వన్డేల్లో గెలిచి కేవలం 19 వన్డేల్లో మాత్రమే ఓడిపోయింది. 2015 ప్రపంచకప్ తర్వాత వన్డేల్లో పూర్తి భిన్నమైన ఆటను ప్రదర్శిస్తున్న ఇంగ్లాండ్ చివరగా పూర్తి సిరీస్ ఓడింది భారత్ చేతిలోనే.