YSRCP president YS Jaganmohan Reddy on Tuesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu and Janasena President Pawan Kalyan on special status issue.
ఏపీ బంద్‌లో భాగంగా వైయస్సార్‌సీపీ కార్యకర్త దుర్గారావు గుండెపోటుతో చనిపోయారని, ఆయన మరణానికి చంద్రబాబే కారణమని వైయస్ జగన్ అన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవని జగన్ మండిపడ్డారు. బంద్ ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని అన్నారు. అన్ని జిల్లాల్లోనూ వందలాది మందిని అరెస్టులు చేశారని జగన్ చెప్పారు. బలవంతంగా బస్సులను నడిపేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు.
అంతేగాక, ‘పవన్ కళ్యాణ్ ఆరు నెలలకోసారి బయటకొస్తాడు. ఓ రోజు ఓ ట్వీట్ ఇస్తాడు. లేదంటే ఓ ఇంటర్వ్యూ ఇస్తాడు.. పోతాడు.. నాలుగేళ్లుగా మనం చూసింది అంతే. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడటం మొదలు పెడితే.. దానికి మనం సమాధానం చెప్పాలంటే..ఎక్కడున్నాయి విలువలు?. విలువల గురించి పవన్ మాట్లాడతాడు.. నిజంగా తనకు ఎక్కడున్నాయి విలువలు? నలుగురు.. నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఈ పని చేస్తే.. ‘నిత్యపెళ్లికొడుకు' అని బొక్కలో వేస్తారా? లేదా? ఇది పాలీగామీ కాదా? ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు బయటకొచ్చి.. తానేదో సచ్ఛీలుడను అని మాట్లాడతారు. ఇలాంటి వాళ్ల గురించి మనం సీరియస్‌గా తీసుకుని, వాళ్ల గురించి విశ్లేషించుకునే పరిస్థితికి రావడమంటే నిజంగా రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు బాధేస్తుంది' అని జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాగా, పవన్‌పై జగన్ ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి.