Virat Kohli Stands In Rich List Of Instagam

Oneindia Telugu 2018-07-25

Views 135

Virat Kohli feels "it doesn't matter if he doesn't score runs as long as India wins" but England pace spearhead James Anderson said the Indian captain has to be lying if he states that his individual form won't be a factor in the upcoming five-Test series starting August 1. "It doesn't matter if he gets runs or not? I think he is telling lies there," Anderson said in jest when asked about Kohli's statement.
#ViratKohli


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. ఆటగాడిగా, కెప్టెన్‌గా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన కోహ్లీ తాజాగా విడుదలైన మరో రిచ్ లిస్ట్‌లోనూ చోటు దక్కించుకున్నాడు.
ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇనిస్టాగ్రామ్ బుధవారం తన రిచ్ లిస్ట్‌ను ప్రకటించింది. హాపర్‌హెచ్‌క్యూ.కామ్ విడుదల చేసిన డేటా ప్రకారం కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పాన్సర్డ్ పోస్ట్‌లు పోస్టు చేసేందుకు గాను పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో అత్యధిక మొత్తం తీసుకుంటున్న అథ్లెట్ల జాబితాలో విరాట్ కోహ్లీ 9వ స్థానంలో ఉన్నాడు. బాస్కెట్ బాల్ సూపర్‌స్టార్ స్టీఫెన్ కర్రీ, ప్రొఫెషనల్ బాక్సర్ ప్లాయిడ్ మేవెథర్‌లను సైతం కోహ్లీ వెనక్కినెట్టాడు. పోర్చుగల్ పుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక, ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో తర్వాత నెయ్‌మార్, లియోనల్ మెస్సీ, డేవిడ్ బెక్‌హామ్, గారెత్ బేల్, ఇబ్రహిమోవిచ్, సురెజ్‌లాంటి ఫుట్‌బాల్ ప్లేయర్లు ఉన్నారు. 8వ స్థానంలో అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ ఫైటర్ కానర్ మెక్‌గ్రెగర్ ఉన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS