Reliance Jio recently announced a new scheme called 'JioPhone Monsoon Hungama'. As part of this scheme, Reliance Jio is offering mobile phones users to exchange their existing device - which needs to be in working condition, among other specifications - to get a JioPhone by paying an amount of Rs. 501, according to the telecom company's website - jio.com. Without the exchange offer, the JioPhone device is available at Rs. 1,095, according to Reliance Jio.
#news
#technology
#mobiles
#reliancejio
#MonsoonOffers
సంచలనాలతో దూసుకుపోతున్న జియో ఈ మధ్య జియోఫోన్ మీద మాన్‌సూన్ హంగామా ఆఫర్‌ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆఫర్ ద్వారా పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకుని జియోఫోన్ ని యూజర్లు పొందవచ్చు. అయితే ఇందుకోసం యూజర్లు రూ.501 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ మొత్తంపై ఇప్పుడు జియో యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా జియోఫోన్ పొందాలనుకునే యూజర్లు మొత్తం రూ. . 1,095 చెల్లించాలని కంపెనీ ఇచ్చిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ నెల ప్రారంభంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వర్కింగ్ కండీషన్‌లో ఉన్న పాత ఫీచర్ ఫోన్‌ను ఇచ్చేసి, జియోఫోన్‌ను కేవలం రూ.501కే కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.