Bigg Boss Season 2 Telugu : Nandini Rai Clarifies About Her & Tanish Love Rumor

Filmibeat Telugu 2018-08-07

Views 2.5K

Nandini Rai Clarifies About Her & Tanish Love Rumor. She said we are just friends not lovers. Actress Nandini Rai has been eliminated from Nani's TV show Bigg Boss Telugu 2 in the eighth week, while Kaushal, Babu Gogineni, Ganesh and anchor Deepthi remained safe from eviction.
బిగ్‌బాస్ ఇంటి నుండి గతవారం ఎలిమినేట్ అయిన నందీనీ రాయ్ బయటకు వచ్చిన తర్వాత మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. ఈ సందర్భంగా ఆమె కొందరు ఇంటి సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో షాకయ్యాను. ఇంకొంత కాలం ఇంట్లో ఉండాల్సింది.... నా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అనిపించింది. కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేయడం వల్లే ఇదంతా జరిగింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నాని ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ 2 వీక్స్ నా జర్నీ అనేది చాలా బావుంది. బయటకు వచ్చి నన్ను నేనుచూసుకున్న తర్వాత కొన్ని మిస్టేక్స్ అనిపించాయి. అది మిస్టేక్స్ కూడా కాదు. నేను చేసింది రైటే. అది కౌశల్ విషయంలో అయినా, తనీష్ విషయంలో అయినా, దీప్తి విషయంలో అయినా నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. నాకు నచ్చలేదంటే నచ్చలేదనే చెప్పాను. అది ఆడియన్స్ ఎలా తీసుకున్నారో తెలియదు.
బయటకు వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ ఉన్నట్లు తెలిసింది. నాకు కౌశల్‌కు ఇంట్లో చాలా సార్లు గొడవ జరిగింది. మేము ఫ్రెండ్స్... గొడవ అవుతుంది, బ్రతిమిలాడుకుంటాం, కలిసి తింటాం.... మేము లోపల బానే ఉన్నాం, బయట కౌశల్ ఆర్మీ వల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయిందని నమ్ముతున్నాను. వాళ్లు నన్ను టార్గెట్ చేసినందుకు నేను ఎలిమినేట్ అయ్యాను.

Share This Video


Download

  
Report form