వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నిర్బంధంతో పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. వైసీపీ నేతల గృహ నిర్బంధంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనే నడుస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు.