ప్రజాప్రతినిధులు తమకు బంధువులంటూ పోలీసులను, అధికారులను తమ విధులను నిర్వర్తించుకోకుండా అడ్డుకునే వారిని చాలామందినే చూశాం. అయితే, ఇక్కడ మాత్రం నిబంధనలు అతిక్రమించే అలాంటి వారిని శిక్షించాల్సిందేనని ఏకంగా ముఖ్యమంత్రే స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఇలాంటి ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా కొందరు నిబంధనలను అతిక్రమించి తమ వాహనాలకు సైరన్ పెట్టుకుంటూ పోలీసులకు చిక్కుతున్నారు.