Nikhil Gowda bumper offer to Tollywood directors. Nikhil new movie is Seetharama Kalyana
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ సినీ అభిమానులకు గుర్తుండే ఉంటాడు. రెండేళ్ల క్రితం విడుదలైన జాగ్వార్ చిత్రంలోతో నిఖిల్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం కోసం చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయినా కూడా జాగ్వార్ చిత్రం మెప్పించలేకపోయింది.
యువ హీరో సీతారామ కల్యాణ అనే చిత్రంలో నటిస్తున్నాడు. స్టార్ హీరోగా అవతరించేందుకు నిఖిల్ కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
యాక్షన్ హీరోగా నిరూపించుకోవాలని నిఖిల్ చేసిన జాగ్వార్ చిత్రం బెడిసికొట్టింది. ఆ చిత్రం తెలుగు కన్నడ భాషల్లో విడుదలై దారుణంగా పరాజయం చెందింది. మంచి కథ ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందని గ్రహించిన నిఖిల్ తదుపరి చిత్రాల కోసం కొత్త ఎత్తుగడ వేశాడు.
దర్శకులని తన వైపుకు ఆకర్షించుకునేందుకు బారీ ఆఫర్ ప్రకటించాడు. మంచి కథతో తనతో సినిమా తీయడానికి వస్తే 5 కోట్లకు పారితోషకం ఇస్తానని ప్రకటించాడు. ఈ ఆఫర్ తెలుగు దర్శకులకు కూడా అంటూ నిఖిల్ ప్రకటన చేయడం విశేషం.