RX 100 Director Ajay Bhupathi Tied The Knot With Laxmi Shirish

Filmibeat Telugu 2018-08-27

Views 1K

RX 100 director Ajay Bhupati tied the knot with Laxmi Shirish on August 25th. Hero Nitin, Ram, Kartikeya, producers Ananda Prasad, Sravanti Ravi Kishore, Sudharkar Reddy, Heroine Payal Rajput are the dignitaries list.
టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచిన RX 100 దర్శకుడు అజయ్ భూపతి ఓ ఇంటి వాడయ్యాడు. హైదరాబాద్‌లోని శామీర్‌పేటలోని ఓ కల్యాణ వేదిక వద్ద శనివారం రాత్రి లక్ష్మీ శిరీషతో అజయ్ వివాహం జరిగింది. ఈ పెళ్లికి సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అజయ్ భూపతి పెళ్లికి హాజరైన వారిలో హీరో రామ్, నితిన్, కార్తీకేయ, నటుడు రావు రమేష్, నిర్మాత సుధాకర్ రెడ్డి, స్రవంతి మూవీస్ అధినేత కిశోర్, భవ్య సిమెంట్స్ అధినేత, నిర్మాత వెనిగళ్ల ఆనంద ప్రసాద్, నిర్మాత అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అజయ్ పెళ్లికి RX 100 చిత్ర హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, హీరో కార్తీకేయ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. RX 100 చిత్రానికి పనిచేసిన చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చి అజయ్ దంపతులను ఆశీర్వదించారు. అజయ్, శిరీష వివాహానికి హాజరైన ఫొటోను హీరో కార్తికేయ ట్వీట్ చేశారు. ‘నా బాస్‌‌కు ఆయన సొంత బాస్ వచ్చారు’ అని కార్తికేయ ట్వీట్‌లో పేర్కొన్నారు. అజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Share This Video


Download

  
Report form