After Their marriage, Samantha Akkineni and Naga Chaitanya Akkineni will have a face-off this week at the box office. While Samantha will be seen in her film U Turn, a Tamil-Telugu bilingual, Chaitanya's Shailaja Reddy Alludu is also releasing on the same day - September 13.
#SamanthaAkkineni
#NagaChaitanyaAkkineni
#UTurn
#ShailajaReddyAlludu
#tollywood
దక్షిణాదిలో హాటెస్ట్ జంట సమంత, నాగచైతన్య మధ్య బాక్సాఫీస్ పోరు మొదలైంది. సమంత నటించిన యూటర్న్, నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు ఒకే రోజున విడుదల కానున్నాయి. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్నది. చైతూ, సమంత పెళ్లి తర్వాత వారిద్దరు నటించిన సినిమాలు ఒకే రోజున పోటాపోటిగా విడుదల కావడం చర్చనీయాంశమైంది. ఈ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో అనే విషయంపై ఆసక్తి పెరిగింది. ఇక మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు రూపొందింది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించింది. రమ్యకృష్ణ కీలక పాత్రను పోషించింది. పవర్ ఫుల్ అత్త పాత్రలో రమ్యకృష్ణ మరోసారి తన నటనతో కనువిందు చేయనున్నారు.