బీహార్ ముజఫర్‌నగర్‌లోని అనాథాశ్రమంలో పిల్లలపై అత్యాచార ఘటన మరువకముందే మరో ఘటన మరో ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ప్రైవేట్ హాస్టల్ నడిపే నిర్వాహకుడు అక్కడి ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు అబ్బాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. హాస్టల్ ఓనర్ తమపై అత్యాచారం చేశాడని ఆ హాస్టల్‌లో ఉంటున్న చెవిటి అంధ విద్యార్థులు చెప్పారు. అంతేకాదు అసహజరీతిలో తమను లైంగికంగా వేధించారని వారు ఆరోపించారు. దీనిపై మధ్యప్రదేశ్ విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపించింది.
#children
#Muzzafarpur
#madyapradesh
#uttara pradesh
#bhopal