Bigg Boss Telugu Season 2 : I'm In Love With Deepthi Sunaina Says Roll Rida

Filmibeat Telugu 2018-09-26

Views 2

I Was In Love With Deepthi Sunaina in BiggBossTelugu2 lovers task Says Roll Rida. After getting eliminated from Bigg Boss Telugu 2, rapper Roll Rida shared some interesting Things about the Reality show.

బిగ్‌బాస్ తెలుగు 2 నుండి గతవారం బయటకు వచ్చిన రోల్ రైడా..... ఎక్కువకాలం పాటు బిగ్ బాస్ ఇంట్లో ప్రేక్షకుల మద్దతుతో కొనసాగిన కంటెస్టెంటుగా పేరు తెచ్చుకున్నాడు. మరో వారం రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తుంది అనే సమయంలో రోల్ రైడా ఎలిమినేట్ అయ్యారు.
బిగ్‌బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయిన ఈ రాపర్... పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా దీప్తి సునైనతో జరిగిన లవర్ టాస్క్ గురించి, అమిత్‌తో తన అనుబంధం గురించి, కౌశల్‌ గురించి వెల్లడించారు.
లవర్స్ టాస్క్ వచ్చినపుడు దీప్తి సునైనాతో బాగా ప్లే చేసినట్లు ఉన్నారు అని యాంకర్ ప్రశ్నించగా... దానికి రోల్ రైడా స్పందిస్తూ అది వన్ సైడ్ లవ్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఆ సమయంలో ఆమె వైపు నుండి లవ్ కనిపించలేదు అని తెలిపారు.

Share This Video


Download

  
Report form