ముందస్తు ఎన్నికలపై స్టే విధించే అధికారం హైకోర్టుకు

Oneindia Telugu 2018-10-04

Views 836

Supreme Court suggestion to High Court on Telangana early elections. SC says High Court have right to stay on early elections.
#SupremeCourt
#HighCourt
#kcr
#trs
#EarlyElections
#telangana

తెలంగాణలో ముందస్తు ఎన్నికల పిటిషన్ పైన సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరిగింది. అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పైన స్టే విధించవలసి వస్తే హైకోర్టుకు ఆ అధికారం ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ లోపే విచారణ పూర్తి కావాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు కనిపిస్తే హైకోర్టు స్టే విధిస్తుందనే ఆశతో విపక్షాలు ఉన్నాయి. అదే జరిగితే తెరాసకు షాక్ అని చెప్పవచ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS