'Vivek Agnihotri Asked Me To Strip And dance' Says Tanu Sri Dutta

Filmibeat Telugu 2018-10-04

Views 1

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో తనతో మిస్ బిహేవ్ చేశాడని, లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తా... 'చాకోలేట్' సినిమా సమయంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అసిస్టెంట్లకు చెప్పి తన బట్టలు విప్పించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో తనుశ్రీ దత్తా ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. తనుశ్రీ దత్తా తనపై చేసిన ఆరోపణలను 'చాకొలేట్' మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఖండించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండి పడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమెపై పరువు నష్టం కేసు వేశానని, తన లాయర్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు.
#tanusridutta
#VivekAgnihotri
#nanapatekar
#twinklekhanna
#bollywood
#hornokplease

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS