Deepika Padukone has finally zeroed in on her next Bollywood film. The actress has taken on the role of Laxmi Agarwal in a Meghna Gulzar directorial. Deepika will also be producing the film.
#Deepika Padukone
#Laxmi Agarwal
#Meghna Gulzar
#padmavat
#Bollywood
పద్మావత్' తర్వాత బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ నెక్ట్స్ మూవీ ఎట్టకేలకు ఖరారైంది. గత చిత్రంలో రాణి పద్మిని పాత్రలో నటించిన ఈ బెంగుళూరు పాప తర్వాతి సినిమాలో యాసిడ్ ఎటాక్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ పాత్రలో కనిపించబోతున్నారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని స్వయంగా దీపిక నిర్మించబోతుండటం మరో విశేషం. లక్ష్మి అగర్వాల్ 15 ఏళ్ల వయసులోనే యాసిడ్ దాడికి గురయ్యారు. యాసిడ్ ఎఫెక్ట్ వల్ల వికృతంగా మారిన ఆమె ముఖానికి పలు సర్జరీలు జరిగాయి. కొన్నేల్లుగా లక్ష్మి అగర్వాల్ యాసిడ్ దాడులు ఆపాలంటూ కాంపెయిన్స్ నిర్వహించడంతో పాటు యాసిడ్ దాడికి గురైన వారికి సహయం చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె 2014లో మెచెల్లీ ఒబామా చేతుల మీదుగా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు సైతం అందుకున్నారు.
తన తర్వాత గురించి దీపిక పదుకోన్ ముంబైలో మీడియాలో మాట్లాడుతూ... ‘‘నేను లక్ష్మి అగర్వాల్ కథ విన్న వెంటనే భావోద్వేగానికి గురయ్యాను. ఇలాంటి ధైర్యవంతురాలైన మహిళ పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆమె కథ అందరికీ తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాలనుకుంటున్నాను' అని తెలిపారు.