ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ హలో గురు ప్రేమ కోసమే. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరో రామ్ కలిసి దిల్ రాజుతో డాన్స్ చేయించారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా తోడవ్వటంతో దిల్ రాజులో మరింత జోష్ పెరిగింది. కిరాక్ స్టెప్పులు వేసి అదరగొట్టారు.