మోడీ సర్కార్ పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నిర్ణయంతో ఆనాడు దేశమంతా ఇబ్బంది పడిన ఘటనను గుర్తు చేసుకుంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు అయ్యాయి. రెండేళ్ల క్రితం రద్దయిన పెద్ద నోట్ల ప్రభావం ఇప్పటికీ సామాన్యుడిపై ఉందని అన్నారు మన్మోహన్ సింగ్. అంతేకాదు పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పారు ఈ ఆర్థికవేత్త.
#NotesStoppedAnniversary
#Demonetization
#IndianCurrency
#Indianeconomy