Chandrababu Naidu wants TRS defeat in Telangana Assembly elections. Monday he lashed out at kcr And also states that pawan kalyan also supports trs in Telangana.
#TelanganaElections2018
# TelanganaAssemblyelections
#trs
#ChandrababuNaidu
#pawankalyan
#mahakutami
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోతేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. తెలుగు జాతికి మేలు కలగాలంటే తెలంగాణలో మహాకూటమి (ప్రజా ఫ్రంట్) విజయం సాధించాలన్నారు.
రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేసిన తనను కేసీఆర్ ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు.
కేసీఆర్ తనను తిడుతున్నారని, ఎందుకు తిడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, తెలుగు జాతి కలిసి ఉండాలని నేను చెబుతున్నానని, విడిపోయినా కలిసి ఉందామని నేను చెబుతుంటే, మీరెవరు చెప్పడానికని కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి కోసం, దేశ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు.