Riding on a 56th minute goal from Simon Gougnard, Belgium played out a 2-2 draw against India in their second Pool C match of the 2018 Hockey World Cup on Sunday.
#HockeyWorldCup2018
#KalingaStadium
#tournament
#IndiavsBelgium
#ManpreetSingh
#SimranjeetSingh
2013 నుంచి భారత్-బెల్జియం 19 సార్లు తలపడగా.. భారత్ ఐదింట్లో మాత్రమే గెలిచింది. బెల్జియం 13 పర్యాయాలు నెగ్గింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరోసారి టీమిండియా పాత పద్ధతినే అనుసరించింది. ఆరంభంలో అద్భుతంగా ఆడిన భారత్ చివరి వరకూ నిలబెట్టుకోలేకపోయింది. ప్రపంచకప్‌లో కఠిన ప్రత్యర్థిపై గెలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుంది. హాకీ ప్రపంచకప్‌లో బెల్జియంతో జరిగిన మ్యాచ్‌ను 2-2తో డ్రా గా ముగించింది. టీమిండియా తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో), సిమ్రన్ జీత్ సింగ్ (47వ నిమిషంలో) గోల్స్ చేశారు. బెల్జియం జట్టు నుంచి హెండ్రిక్స్ అలెగ్జాండర్ (8వ నిమిషంలో), గ్వాంగనార్డ్ సిమన్ (56వ నిమిషంలో)నే రాణించారు. ఆట మొదలైన ఎనిమిదో నిమిషంలోనే అలెగ్జాండర్ గోల్ చేసి బెల్జియంను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు.