All-round Australia displayed a dominating performance to defeat India by 146 runs on Day 5 of the second Test and level series at 1-1. Australia walked away with a comfortable win by 146 runs. Nathan Lyon was man of the match for his 8 wickets in the match.
#IndiavsAustralia
#INDVSAUS
#RishabhPant
#viratkohli
#MohammedShami
ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు చివరి మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లోనే వెనుకబడి ఉన్న టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మరింత పేలవంగా చేజార్చుకుంది. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. 43 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకి ఆలౌటై.. భారత్‌కి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇప్పటి వరకూ ఛేదించలేదు. 287 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. 140 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్ దారుణంగా విఫలమవడంతో మిడిలార్డర్, లోయరార్డర్ సైతం చేతులెత్తేసింది. రహానే (30), పంత్ (30), విహారి (28), విజయ్ (20), కోహ్లి(17)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.