Yash starrer KGF has achieved a new milestone. The MOVIE has set new benchmarks for the Kannada cinema at the worldwide box office. In just 5 days, the film has crossed the Rs 100 crore mark and has become the first Kannada film to do so.
ఓవర్సీస్ మార్కెట్‌లో కేజీఎఫ్ చిత్రం సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన కన్నడ చిత్రంగా రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 413,214 డాలర్లు వసూలు చేసింది. తాజా రిపోర్టుల ప్రకారం ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది అని పలువురు ట్రేడ్ అనలిస్టులు ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ తెలుగు చిత్రాల రిలీజ్ మధ్య బ్రహ్మండమైన వసూళ్లను సాధించింది. పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలకు ధీటుగా నిలిచింది. గత ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.7.30 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఆంధ్రాలోనే కాకుండా నైజాంలో కూడా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రమోషన్ టూర్ చేపట్టగా బుధవారం తిరుపతి, విజయవాడలో మంచి స్పందన కనిపించింది.
#kgf
#KGF
#KGFboxofficecollection
#KGFPublicReaction
#KGFPublicreview
#Yash
#కేజీఎఫ్