ఇండియాలో సినీ హీరోలని ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోల్ని దైవంగా ఆరాధించే అభిమానులు సౌత్ లో ఎక్కువగా కనిపిస్తారు. హీరోల అభిమానుల మధ్య వివాదాలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తూనే ఉంటాం. ఇదిలా ఉండగా తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్, అజిత్ లకు వీరాభిమానులు ఎక్కువగా ఉంటారు. తమ అభిమాన హీరోల చిత్రాలు విడుదలయ్యే సమయంలో వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కొన్ని సందర్భంలో అభిమానుల సంబరాలు ప్రమాదంగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది