Supreme Court Judgment On Rafale Deal Diminished Judiciary’s Credibility Says Arun Shourie

Oneindia Telugu 2019-02-09

Views 566

Senior journalist and former Union Minister Arun Shourie said Friday that the Supreme Court judgment on the plea on Rafale deal, of which he was one of the petitioners, had only diminished judiciary’s credibility.
#ArunShourieonRafaledeal
#SupremeCourtonRafaledeal
#PMNarendramodi
#rahulgandhi

రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ విలువలకు భంగం కలిగించేలా ఉందని ఆయన అన్నారు. రాఫెల్ పై పిటిషన్ వేసిన వారిలో అరుణ్ శౌరి కూడా ఉన్నారు. రాఫెల్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మీరు సంతృప్తి చెందారా అన్న విలేఖరి ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. సుప్రీం తీర్పుతో తాను బాధపడలేదని అయితే సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పు ఇవ్వడం వల్ల న్యాయవ్యవస్థ విలువలు ప్రశ్నార్థకంగా మారుతుందని శౌరీ వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటునే సుప్రీం కోర్టు చదివినట్లుగా తనకు అనిపించిందని శౌరి వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాము ముందు నుంచి వాదిస్తున్నట్లుగా రాఫెల్‌లో ఏదో అవకతవకలు జరిగినట్లు రుజువయ్యాయని పేర్కొన్నారు. అయితే దీనిపై త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు శౌరి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS