India vs Australia 2019 : Kohli Will Be Tough For The Australian Bowling Situvations

Oneindia Telugu 2019-02-19

Views 214

Former Australia opener Mathew Hayden believes that the kind of from Virat Kohli is in right now, it will be tough for the Australian bowling attack, especially youngster Jhye Richardson,to contest with the Indian skipper.
#indiavsaustralia
#australiainindia2019
#viratkohli
#jhyerichardson
#matthewhayden
#shamshabad
#uppalstadium
#vishakapatnam

సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఆస్ట్రేలియా బౌలర్లకు చిక్కులు తప్పవని ఆ దేశ మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ హెచ్చరించాడు.

మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ ఇటీవల ఆసీస్ పర్యటనలో కోహ్లీని మూడు సార్లు ఔట్ చేసిన యువ ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌‌‌కి ఈసారి అంత సులువుగా వికెట్ దక్కబోదని మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. "ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌లో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కాస్త తడబడ్డాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతుల్ని వెంటాడే ప్రయత్నంలో మూడుసార్లు వికెట్ చేజార్చుకున్నాడు. అయితే, భారత్‌లో పరిస్థితులు వేరులా ఉంటాయి. మరోవైపు రిచర్డ్‌సన్ ఇంకా యువకుడు.. అతనికి తగినంత క్రికెట్ అనుభవం లేదు" అని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ కచ్చితంగా ఈసిరీస్‌లో పూర్తిస్థాయిలో ఆధిపత్యం కనబరుస్తాడు. ఇటీవల కోహ్లీ ఫామ్‌ను చూస్తుంటే.. రిచర్డ్‌సన్‌కే కాదు.. ఆస్ట్రేలియా బౌలర్లందరికీ చిక్కులు తప్పేలాలేవు" అని హెడెన్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఆడనున్న చివరి సిరిస్ కావడంతో ఈ సిరిస్‌లో టీమిండియా ప్రయోగాల బాట పట్టేలా కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS