he Indian and Australian teams arrived in Nagpur for upcoming second ODI match which is going to be held at Vidarbha Cricket Association stadium in Nagpur on Tuesday, March 5.
#IndiaVsAusatralia20192ndODI
#viratkohli
#msdhoni
#rohithsharma
#BCCI
#CKKhanna
#cricket
#teamindia
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఘన విజయం సాధించిన ఊపును రెండో వన్డేలోనూ కొనసాగించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయిదు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
కేప్టెన్ విరాట్ కోహ్లీ సహా దాదాపు భారత జట్టు ఆటగాళ్లందరూ ఆదివారం మధ్యాహ్నం నాగ్ పూర్ కు చేరుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన జట్టు మధ్యాహ్నానికి నాగ్ పూర్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు మరో విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి నాగ్ పూర్ కు చేరుకుంది. రెండు జట్ల ఆటగాళ్లకు విదర్భ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు నాగ్ పూర్ విమానాశ్రయంలో సాదరంగా ఆహ్వానించారు. రెండో వన్డే ఆడబోయే రెండు జట్లలో ఎలాంటి మార్పులూ దాదాపు ఉండకపోవచ్చు.