TDP president Chandrababu Naidu released his assembly and loksabha candidates list after a long polit beaureau meet. Chandra babu's son Lokesh is contesting from Mangalagiri, and few sitting MLA's constituencies were shifted to the other Constituencies. After taking into consideration of all factors Chandrababu put out the TDP final list.
#APElection2019
#TDPCandidatesfinalList
#ChandrababuNaidu
#Lokesh
#contesting
#Mangalagiri
#Constituencies
#loksabhaelections2019
సుదీర్ఘ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత 2019 అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మిషన్ 150 ప్లస్‌గా అభివర్ణించిన చంద్రబాబు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించి గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. పలు సమీక్షలు సర్వేలు చేశాకే తుది జాబితా తయారు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. గత కొద్దిరోజులుగా కొందరు నేతలు టికెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ తర్వాత చంద్రబాబు వారిని బుజ్జగించడంతో వెనక్కు తగ్గారు.ఇదిలా ఉంటే లోక్‌సభ అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేస్తామని దీంతో పాటుగానే ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పారు.