Niharika about Pawan Kalyan At Suryakantham Promotions
#Pawankalyan
#Niharika
#Tollywood
#Rahulvijay
#Nagachaitanya
#Suryakantham
మెగా డాటర్ నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత నిహారిక కేవలం తనకు సరిపడే పాత్రలని మాత్రమే ఎంచుకుంటూ ఆచి తూచి అడుగులువేస్తోంది. తాజాగా నిహారిక నటిస్తున్న చిత్రం సూర్యకాంతం. రాహుల్ విజయ్ నిహారికకు జంటగా నటిస్తున్నాడు. దర్శకుడు ప్రణీత్ హాస్యానికి పెద్ద పీట వేస్తూ నిహారిక పాత్రని హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సూర్యకాంతం చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.