సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్యను రాజకీయ హత్యగా భావిస్తున్నారు వైసీపీ నేతలు. తన చిన్నాన్నను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారని - నిందితులు ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే దీనిపై జగన్ డిమాండ్ కు ముందే అధికార టీడీపీ వివేకా హత్యను రాజకీయం చేయాలనుకుంటున్నారంటూ ఎదురు దాడికి దిగింది. మంత్రులు - చివరకు సీఎం నారా చంద్రబాబునాయుడు సైతం తమదైన వాదనను వినిపించారు.హత్యపై దర్యాప్తుకు సిట్ ను వేసింది ఏపీ ప్రభుత్వం .
#YSVivekanandaReddy
#YSjagan
#ysrcp
#chandrababunaidu
#ysrajasekharreddy
#APElection2019
#loksabhaelection2019