Janasena Chief Pawan Kalyan who said that Andhra people are facing troubles in Telangana was countered by the TRS working President KTR. KTR said that People belonging to 29 states are living with peace and harmony in Telangana. This sort of rhetoric creates undesirable negativity, tweeted KTR.
#LokSabhaElection2019
#PawanKalyan
#KTR
#janasena
#TRS
#ktr
#ysjagan
#ysrcp
#telangana
తెలంగాణలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పవన్ కళ్యాణ్ ఏపీలో తన ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణకు వెళితే ఆంధ్రావాళ్లను కొడుతున్నారన్న పవన్ వాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇక్కడ 29 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉంటున్నారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మధ్య ప్రజలను ఇబ్బంది పడేలా వ్యవహరించొద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గాజువాక, భీమవరంలలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్... బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణకు వెళ్తే ఆంధ్రవాళ్లను కొడుతున్నారనే వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్. ఇక జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని కేసీఆర్‌కు నమస్కరించి కోరుతున్నట్లు చెప్పారు. ఇక గాజువాకలో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పెరిగింది.