శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి..!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-13

Views 2

Bhadradri Ramalayam ready for Sri Navami Celebrations. Temple and District Officials made arrangements according to devotees rush. Seetharama Marriage held on sunday and Coronation on Monday.In the seventh incarnation of the Dasavataras .. Chaitra Shruthi Navami in the spring of the year, Sri Ramudu was born at 12 o'clock in the resort Karkataka Lecture on Thursday. Every year we celebrate Sri Rama Navami.
#srirama navami
#bhadrachalam
#telangana
#bhadradri
#ramalayam
#wedding
#devotees

భద్రాద్రి ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం తలమునకలైంది. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీ సీతారాముల తిరు కల్యాణోత్సవం ఆదివారం (14.04.2019) నాడు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే సోమవారం (15.04.2019) నాడు రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు. భద్రాద్రి రాములోరి గుడి విద్యుత్ దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది. భద్రాచలంలోని ప్రధాన కూడళ్లతో పాటు మెయిన్ సెంటర్లలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు స్వామివారి వివాహ వేడుక జరగనున్న మిథిలా ప్రాంగణంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు వేయించారు. భక్తులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS