Virat Kohli feels lucky to have an astute mind like MS Dhoni behind the stumps as he believes there is no one better at reading match situations than the former India captain. Heaping praise on MS Dhoni ahead of a crucial event like ICC World Cup 2019.
#iccworldcup2019
#viratkohli
#support
#msdhoni
#teamindia
#cricket
#Rohithsharma
క్రికెట్‌లో విధేయత అనేది చాలా ముఖ్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుంది.ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న విరాట్‌కోహ్లీ వరల్డ్ కప్ జట్టుపై ఇండియా టుడేకి ప్రత్యేకంగా ఇంటర్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్యూలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై విరాట్ కోహ్లీ తన విధేయతను చాటుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ "విధేయత అనేది చాలా ముఖ్యం. నేను జట్టులోకి వచ్చిన కొత్తలో పెద్దగా ఆకట్టుకోలేదు. నన్ను కాదని వేరొకరిని ప్రయత్నించే అవకాశం ఉన్నా, మహీభాయ్ ఆ పని చేయలేదు" అని అన్నాడు.